‘అంబేడ్కర్‌’ను అవమానించిన వారిని అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2021-08-25T07:00:51+05:30 IST

అమలాపురం మహాత్మాగాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రంలోని కళ్లను చెరిపేసి అవమానించిన దోషులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండుచేస్తూ మంగళవారం స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో దళిత ప్రజా సంఘాలు, అంబేడ్కర్‌ యువజన సంఘాల సం యుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

‘అంబేడ్కర్‌’ను అవమానించిన వారిని అరెస్టు చేయాలి

అమలాపురం టౌన్‌, ఆగస్టు 24: అమలాపురం మహాత్మాగాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రంలోని కళ్లను చెరిపేసి అవమానించిన దోషులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండుచేస్తూ మంగళవారం స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో దళిత ప్రజా సంఘాలు, అంబేడ్కర్‌ యువజన సంఘాల సం యుక్త ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. విద్యాల యాల్లో రాజ్యాంగ నిర్మాతకు అవమానం సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. నిందితులను  కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. లేని పక్షంలో కోనసీమ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని దళిత నాయకులు హెచ్చరించారు. అనంతరం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. ధర్నాలో దళిత ప్రజాసంఘాల నాయకులు డీబీ లోక్‌, జంగా బాబూరావు, రేవు తిరుపతిరావు, కొంకి రాజామణి, ముత్తాబత్తుల శ్రీను, గెద్దాడ బుద్దరాజ్‌, పెట్టా శ్రీను, పొలమూరి ఆనంద్‌, గండి ధర్మరాజు, కోండ్రు సురేష్‌, తిరుగుళ్ల సందీప్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-25T07:00:51+05:30 IST