రేపు మహాసభ జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2021-03-22T04:52:30+05:30 IST

భానుగుడి (కాకినాడ), మార్చి 21: అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఏఐఎ్‌ఫటీయూ) ఆధ్వర్యాన మంగళ వారం కాకినాడ సూర్యకళామందిరంలో జరిగే మహాసభను జయప్రదం చేయాలని జిల్లాశాఖ కన్వీనర్‌ ఆర్‌.సతీష్‌ కోరారు. ఏఐఎ్‌ఫటీయూ ఆధ్వర్యాన రైతుబజార్‌ వద్ద

రేపు మహాసభ జయప్రదం చేయాలి
ప్రచారజాత నిర్వహిస్తున్న ఏఐఎ్‌ఫటీయూ సభ్యులు

ఏఐఎ్‌ఫటీయూ జిల్లాశాఖ కన్వీనర్‌ సతీష్‌ 

భానుగుడి (కాకినాడ), మార్చి 21: అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఏఐఎ్‌ఫటీయూ) ఆధ్వర్యాన మంగళ వారం కాకినాడ సూర్యకళామందిరంలో జరిగే మహాసభను జయప్రదం చేయాలని జిల్లాశాఖ కన్వీనర్‌ ఆర్‌.సతీష్‌ కోరారు. ఏఐఎ్‌ఫటీయూ ఆధ్వర్యాన రైతుబజార్‌ వద్ద సాంస్కృతిక మండలి ఆదివారం ప్రచార జాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల జీతభత్యాలను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్మికుల మహాసభలో పాల్గొనేందుకు కామ్రేడ్‌ విమలక్క విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు నిత్యావసర ధరల పెంపుపై నిరుపేదలు పడుతున్న ఇబ్బందులను ప్రచార జాతలో ప్రదర్శించారు.

Updated Date - 2021-03-22T04:52:30+05:30 IST