‘వలసదారుల నుంచి అటవీ భూములను కాపాడండి’

ABN , First Publish Date - 2021-08-27T06:13:41+05:30 IST

తుని మండలం రేఖవానిపాలెంలో వలసదారుల ఆక్రమణకు గురైన అటవీ భూములను కాపాడంటూ గ్రామస్థులు సీపీఎం(ఎల్‌) ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్‌రేట్‌వద్ద గురువారం ధర్నా నిర్వహించారు.

‘వలసదారుల నుంచి అటవీ భూములను కాపాడండి’

భానుగుడి(కాకినాడ), ఆగస్టు 26: తుని మండలం రేఖవానిపాలెంలో వలసదారుల ఆక్రమణకు గురైన అటవీ భూములను కాపాడంటూ గ్రామస్థులు సీపీఎం(ఎల్‌) ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్‌రేట్‌వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బగతా బంగా ర్రావు మాట్లాడుతూ కొన్నేళ్లుగా గ్రామస్థులు, పేదల దగ్గర నుంచి డీ పట్టా భూములను కొనుగోలు చేసి వందల ఎకరాల అటవీ భూములను ఎక్స్‌కవేటర్లతో తవ్వుతూ యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారన్నారు. ఇప్పటివరకూ ఈ విషయా న్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నిమ్మకు నిరెత్తినట్లు వ్యవ హరిస్తున్నా రని, అధికారులు వలసదారుల జోలికి వెళ్లడం లేదని అన్నారు. అటవీ భూములపై ఫారెస్టు అధికారులు సర్వే నిర్వహించి వలసదారులనుంచి కాపాడాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వంజరపు కాంతం, గొనాల శ్రీను, మానుకొండ లచ్చబాబు, పి.నరసరాజు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-27T06:13:41+05:30 IST