ఏజెన్సీలో 1,186 మందికి ఉద్యోగావకాశాలు

ABN , First Publish Date - 2021-12-19T06:58:58+05:30 IST

పరివర్తన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు నేతృత్వంలో పీవీఎన్‌ఆర్‌ సౌజన్యంతో శనివారం చింతూరులో నిర్వహించిన జాబ్‌మేళా విజయ వంతమైంది.

ఏజెన్సీలో 1,186 మందికి ఉద్యోగావకాశాలు
జాబ్‌మేళా కార్యక్రమం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు తదితరులు

 జాబ్‌మేళా విజయవంతం

అవకాశాలు కల్పించిన 20 కంపెనీలు

చింతూరు, డిసెంబరు 18: పరివర్తన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు నేతృత్వంలో పీవీఎన్‌ఆర్‌ సౌజన్యంతో శనివారం చింతూరులో నిర్వహించిన జాబ్‌మేళా విజయ వంతమైంది. చింతూరు సబ్‌ డివిజను నుంచి దాదాపు 1800 మంది నిరుద్యోగులు జాబ్‌మేళా కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిలో 1,186 మంది అభ్యర్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకా శాలు దక్కించుకున్నారు. ఆయా కేటగిరీలను బట్టి నెలకు రూ.10 వేల నుంచి ఏడాదికి రూ.10 లక్షల ప్యాకేజీలతో కూడిన ఉద్యోగాలను పొందారు. పది లక్షల ప్యాకేజీ పొందిన వారిలో కొప్పుల పృథ్వీ, బుర్రా జయదీప్‌ ఉన్నారు. సుమారు 20 కంపెనీల సీఈవోలతోపాటు, హెచ్‌ఆర్‌లు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేసుకున్నారు. వారికి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. 
Updated Date - 2021-12-19T06:58:58+05:30 IST