అధికారులు కృషి చేయాలి కలెక్టర్‌ హరికిరణ్‌, ఎంపీ గీత

ABN , First Publish Date - 2021-09-03T07:07:43+05:30 IST

మండలంలో నీలాద్రిపేట గ్రామంలో సంపద కేంద్రాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ హరికిరణ్‌, ఎంపీ వంగాగీతవిశ్వనాధ్‌ అన్నారు.

అధికారులు కృషి చేయాలి   కలెక్టర్‌ హరికిరణ్‌, ఎంపీ గీత

గండేపల్లి, సెప్టెంబరు 2: మండలంలో నీలాద్రిపేట గ్రామంలో  సంపద  కేంద్రాల అభివృద్ధికి  అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ హరికిరణ్‌, ఎంపీ వంగాగీతవిశ్వనాధ్‌ అన్నారు. వారు మండలంలో నీలాద్రిపేట గ్రా మంలో గురువారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో చేపట్టిన సాలిడ్‌ వెస్ట్‌ ప్రొసెసింగ్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సంపద తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. మండలంలో ఉన్న సంపద కేంద్రాలను అభివృద్ధి చేసి సంపద తయారయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సాలిడ్‌ వెస్ట్‌ ప్రొసెసింగ్‌  సెంటర్‌కు తరలించి వర్మీ కంపోస్టు తయారు చేయడం ద్వారా పొలంలో మొక్కలకు ఎరువులుగా  ఉపయోగపడు తుందన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జాన్‌లింకన్‌ మా ట్లాడుతూ మండలంలోని 18 సంపద కేంద్రాలు ఉండగా ఇప్పటికే 6 ప్రొసెసింగ్‌ సెంటర్‌లలో వర్మీ కంపోస్టులు తయారుచేశామన్నారు.  కా ర్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ తెలగల దొరబాబు, కందుల చిట్టిబాబు, జాస్తి వసంత్‌, సర్పంచ్‌  సురేష్‌, తహశీల్దార్‌ చిన్నారావు, ఎంపీడీవో జాన్‌లింకన్‌, మధుపట్ల రామకృష్ణ, పోసిన బాబూరావు, ఏపీవో గంగాభవాని, ఆర్‌ఐ నాగేశ్వరరావు పాల్గొన్నారు

రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం

జగ్గంపేట, సెప్టెంబరు 2: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి కాకినాడ ఎంపీ వంగాగీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. అనంతరం కలెక్టర్‌ హరికిరణ్‌తో కలిసి గోకవరం రోడ్డులో ఉన్న సచివాలయం రెండు పరిధిలో రైతు భరోసా కేంద్రా లను  ప్రారంభించారు. ఈ కేంద్రాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌, ప్రభుత్వ పాలకేంద్రాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. పారిశుధ్య కార్మికులకు తడి,పొడి చెత్తను వేరుచేసే సామగ్రిని పంపిణీ చేశారు. తహశీల్దార్‌ కార్యాలయంలో సబ్‌ ట్రెజరీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  మార్కెట్‌ కమిటీ భవనంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 


Updated Date - 2021-09-03T07:07:43+05:30 IST