పాలన, బోధనల్లో తెలుగు భాషను అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-08-28T05:14:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పాలన, బోధనల్లో తెలుగు భాషను అమలు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం కార్యవర్గం డిమాండ్‌ చేసింది.

పాలన, బోధనల్లో తెలుగు భాషను అమలు చేయాలి

 అడ్డతీగల, ఆగస్టు 27: రాష్ట్ర ప్రభుత్వం పాలన, బోధనల్లో తెలుగు భాషను అమలు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం కార్యవర్గం డిమాండ్‌ చేసింది. తెలుగు భాషా వారోత్సవాల్లో భాగంగా వ్యావహారిక భాషో ద్యమ నిర్మాత గిడుగు రామ్మూర్తిపంతులు 158వ జయంతి సందర్భంగా ‘తెలుగు భాషను పరిరక్షించుకుందాం’ అంశంపై శుక్రవారం ఆదివాసీ భవ నంలో సదస్సు నిర్వహించారు. పీడీఎస్‌యూ గౌరవాధ్యక్షుడు ఐ.రమణ మాట్లా డుతూ తెలుగు అకాడమీని తెలుగు కోసమే నడపాలని, ఇతర భాషలను అకాడమీపై రద్దు కూడదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలనలో తెలుగు భాష వినియోగం అడుగంటిందన్నారు. తెలుగు వ్యతిరేక విధానాలతో మన రాష్ట్రంలో అధికారులు తెలుగు భాష వాడుకను పూర్తిగా మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. సదస్సులో ఆదివాసీ ఉపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులు, తెలుగు భాషోద్యమ సమాఖ్య సభ్యులతోపాటు పీడీఎస్‌యూ కార్యవర్గ సభ్యు లు బొగ్గుల సత్యనారాయణరెడ్డి, సుబ్బన్నదొర, బాపన్నదొర, లింగారెడ్డి, కృష్ణా రెడ్డి, జాన్‌రెడ్డి, రాంబాబు, రమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T05:14:06+05:30 IST