చట్టాలపై అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2021-11-23T05:34:48+05:30 IST

పాఠశాల స్థాయి నుంచి ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని దిశ స్టేషన్‌ ఎస్‌ఐలు రేవతి, వెంకటేశ్వరరావు తెలిపారు.

చట్టాలపై అవగాహన ఉండాలి

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 22: పాఠశాల స్థాయి నుంచి ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని దిశ స్టేషన్‌ ఎస్‌ఐలు రేవతి, వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక గాంధీపురం-2 నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల్లో సోమవారం విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. దీనికి వారు ముఖ్యఅతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ నేటి యువత అధికంగా సోషల్‌ మీడియా వైపు ఆకర్షితులౌవుతున్నారని, అయితే సైబర్‌ నేరాగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆండ్రాయిడ్‌ ఫోన్లతో ఉపయోగాలు, ప్రమాదాలపై వివరించారు. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ద్వారా మహిళలు ఎదుర్కొనే సమస్యలను, పోక్సో చట్టం గురించి వివరించారు. ప్రతిమహిళా తమ ఫోన్‌లో దిశ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించారు. సదస్సులో హెచ్‌ఎం ఆర్‌.సన్యాసిరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-23T05:34:48+05:30 IST