చట్టాలపై అవగాహన ఉండాలి: అర్బన ఎస్పీ

ABN , First Publish Date - 2021-03-22T05:55:26+05:30 IST

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ అధికారులు నిరంతరం చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అర్బన ఎస్పీ షిమోషిబాజ్‌పాయ్‌ అన్నారు. స్థానిక అర్బన జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన చట్టాలపై పోలీసులకు అవగాహన సదస్సును ఆమె ఆధ్వర్యంలో నిర్వహించారు.

చట్టాలపై అవగాహన ఉండాలి: అర్బన ఎస్పీ

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 21: అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ అధికారులు నిరంతరం చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అర్బన ఎస్పీ షిమోషిబాజ్‌పాయ్‌ అన్నారు. స్థానిక అర్బన జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన చట్టాలపై పోలీసులకు అవగాహన సదస్సును ఆమె ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనడీపీఎస్‌ యాక్ట్‌, పోస్కో యాక్ట్‌లపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు జీఎస్‌ఎనవీ ప్రసాద్‌, ఆర్‌.రాధాకృష్ణరాజు అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ చట్టాలపై అవగాహన వుంటే వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని, అప్పుడు నేర పరిశోధనలో మెళకువలను పెంపొందించుకుని బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు. ఈ సదస్సులో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T05:55:26+05:30 IST