యాక్షన్ తీసుకున్న తర్వాతే ఆక్షన్ పెట్టండి
ABN , First Publish Date - 2021-08-03T06:19:03+05:30 IST
యాక్షన్ తీసుకున్న తర్వాతే ఆక్షన్‌లు పెట్టండి అంటూ పి.గన్నవరంలో సోమవారం జరిగిన గరుడేశ్వరస్వామి భూముల కౌలు హక్కు బహిరంగ వేలంలో స్థానికులు, పాలకవర్గం సభ్యులు అభ్యంతరం తెలిపారు.

పి.గన్నవరం, ఆగస్టు 2: యాక్షన్ తీసుకున్న తర్వాతే ఆక్షన్‌లు పెట్టండి అంటూ పి.గన్నవరంలో సోమవారం జరిగిన గరుడేశ్వరస్వామి భూముల కౌలు హక్కు బహిరంగ వేలంలో స్థానికులు, పాలకవర్గం సభ్యులు అభ్యంతరం తెలిపారు. దేవస్థానం భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగించాలని, ఇప్పటి వరకు బయటి వ్యక్తి అనుభవిస్తున్న 40 కొబ్బరిచెట్లను పాటదారునికే అప్పగించాలని తదితర సమస్యలను పది రోజుల్లో పరిష్కరించి చర్యలు తీసుకున్న తర్వాతే పాటలు పెట్టాలని స్థానికులు దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ టీవీఎస్‌ఆర్ ప్రసాద్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులకు సమస్యలు వివరించి పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. దేవస్థానం ఆస్తులను, ఆదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని భజరంగదళ్ జిల్లా కన్వీనర్ శిరంగు నాయుడు, అడ్వకేట్ బాపన్న సూచించారు. ఇన్‌చార్జి ఈవో సీహెచ్ సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు, పాటదారులు పాల్గొన్నారు.