హెడ్‌వర్క్సు సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంట్లో ఏసీబి సోదాలు

ABN , First Publish Date - 2021-01-12T07:40:39+05:30 IST

ధవళేశ్వరంలో నీటిపారుదల ఉద్యోగి నివాసంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు.

హెడ్‌వర్క్సు సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంట్లో ఏసీబి  సోదాలు

అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో దాడులు 

సోదాలలో రూ. కోటి 2లక్షల 35వేల అక్రమ ఆస్తులు గుర్తింపు

ధవళేశ్వరం/రావులపాలెం రూరల్‌, జనవరి 11 : ధవళేశ్వరంలో నీటిపారుదల ఉద్యోగి నివాసంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. హెడ్‌వర్క్సు డివిజన్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ పల్లంకుర్తి పద్మారావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ధవళేశ్వరంలోని పద్మారావు ఇంట్లోను, మండపేట, గోపాలపురంలలోని బంధువుల ఇళ్లు, హెడ్‌వర్క్సు డివిజన్‌ కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో చేపట్టిన సోదాల్లో ఇళ్లు, భూములు, బంగా రు వస్తువులను గుర్తించారు. సోదాల్లో రూ. కోటి 2 లక్షల 35 వేలు విలువ చేసే అక్రమ ఆస్తులను కూడబెట్టినట్టు గుర్తించామని డీఎస్పీ తెలిపారు. అలాగే పద్మారావుకు సంబంధించి పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్టు గుర్తించామని, వాటి ని పరిశీలించాల్సి ఉందన్నారు. పద్మారావును ఏసీబీ స్పెషల్‌ కోర్టులో హజరుపరుస్తామన్నారు. దాడుల్లో సీఐ పీవీ సత్యమోహన్‌, పుల్లారావు, పీవీజీ తిలక్‌, వాసుకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ఇక రావులపాలెం మండలం గోపాలపురం లోని పద్మారావు బంధువు సత్యవర ప్రసాద్‌ ఇంట్లో సోదాలు నిర్వహించగా, ఈ సోదాల్లో ఎటువంటి పత్రాలు దొరక లేదని సీఐ మోహనరావు తెలిపారు.

Updated Date - 2021-01-12T07:40:39+05:30 IST