చెరువులో పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-11-23T07:14:51+05:30 IST

మంచినీటి చెరువులో పడి ఒక యువకుడు సోమవారం మృతి చెందాడు.

చెరువులో పడి యువకుడి మృతి

అంబాజీపేట, నవంబరు 22: మంచినీటి చెరువులో పడి  ఒక యువకుడు సోమవారం మృతి చెందాడు. నం దంపూడి పంచాయతీ అమ్మవారితోటకు చెందిన ముత్తా బత్తుల సింహాద్రి (22) ఇంటికి సమీపంలో ఉన్న  మంచి నీటి చెరువు వద్దకు కాళ్లు శుభ్రం చేసుకునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. దీంతో అతడు కేకలు వేయగా స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించి నప్పటికీ నీటిలో కూరుకుపోయి మృతిచెందాడు.     పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-11-23T07:14:51+05:30 IST