కుటుంబ సభ్యుల నిరాదరణతో ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-08-20T06:32:56+05:30 IST

కుటుంబ సభ్యుల ఆదరణ లేకపోవడంతో ఒక వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా పోలీసులు రక్షిం చారు.

కుటుంబ సభ్యుల నిరాదరణతో ఆత్మహత్యాయత్నం

మామిడికుదురు, ఆగస్టు 19: కుటుంబ సభ్యుల ఆదరణ లేకపోవడంతో ఒక వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా పోలీసులు రక్షిం చారు. సోదరుడు, కుమారులు పట్టించుకోక పోవడంతో మనస్థాపం చెందిన అంబాజీపేట మండలం గంగలకుర్రు మెట్లకాలనీకి చెందిన బండారి సూర్య నారాయణ(75) గురువారం పాశర్లపూడి వైనతేయ వారధి నుంచి దూకు తుండగా పోలీసులు రక్షించారు. తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.Updated Date - 2021-08-20T06:32:56+05:30 IST