కూతురు కాపురం సజావుగా లేదని తండ్రి మృతి

ABN , First Publish Date - 2021-10-28T06:19:18+05:30 IST

తన కుమార్తె కాపురం సజావుగా లేకపోవడంతో మనస్తాపం చెందిన తండ్రి తనువు చాలించాడు.

కూతురు కాపురం సజావుగా లేదని తండ్రి మృతి

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

ద్రాక్షారామ, అక్టోబరు 27: తన కుమార్తె కాపురం సజావుగా లేకపోవడంతో మనస్తాపం చెందిన తండ్రి తనువు చాలించాడు. కర్రి వారి వీధికి చెందిన తలపాగల శ్రీనివాసరావు(61) తన కుమార్తె ఈశామాలినికి ఏలూరుకు చెందిన కారుపర్తి గౌతమ్‌ కుమార్‌తో 2020లో వివాహం జరిపించాడు. మరుసటి రోజు నుంచే వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. కుమార్తె జీవితం పాడైందని శ్రీనివాసరావు మనో వ్యధకు గురై బుధవారం ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మృతి చెందాడు. కాగా తనకు అనారోగ్యంగా ఉందని తండ్రి చెప్పినట్టు కుమార్తె ఈశామాలిని తెలుపుతూ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీనివాసరావు మృతదేహాన్ని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్‌ఐ తులసీరామ్‌ అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.  మరోవైపు శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. Updated Date - 2021-10-28T06:19:18+05:30 IST