వ్యక్తి అదృశ్యంపై కేసు

ABN , First Publish Date - 2021-05-02T07:03:42+05:30 IST

57ఏళ్ల వ్యక్తి అదృశ్యంపై ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేశారు.

వ్యక్తి అదృశ్యంపై కేసు

ద్రాక్షారామ, మే 1: 57ఏళ్ల వ్యక్తి అదృశ్యంపై ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేశారు. తాళ్లపొలం గ్రామ శివారు అడపావారి సావరానికి చెందిన కుక్కల ఆదినారాయణ ఈనెల28న రాత్రి భొజనం చేసి నిద్రపోయాడు. 29న తెల్లవారుజామున భార్య మంగ నిద్రలేచి చూసే సరికి ఆదినారాయణ కనిపించలేదు. అతడి ఆచూకి లభించకపోవడంతో ఆదినారాయణ కుమారుడు సూరిబాబు ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హెచ్‌సీ బి.సూర్యనారాయణ కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు.Updated Date - 2021-05-02T07:03:42+05:30 IST