హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2021-10-28T06:20:42+05:30 IST

ఒక వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డ అమలాపురం సావరం రోడ్డుకు చెందిన ఉపాధ్యాయుల సీతారామ శర్మను అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ తెలిపారు.

హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్టు

అమలాపురం టౌన్‌, అక్టోబరు 27: ఒక వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డ అమలాపురం సావరం రోడ్డుకు చెందిన ఉపాధ్యాయుల సీతారామ శర్మను అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ తెలిపారు. పశ్చిమ గోదావరిజిల్లా ద్వారకా తిరుమలకు చెందిన పరిటా సోమశేఖరశర్మకు ఇల్లు కొనుగోలు కోసం రూ.26లక్షలు అప్పుగా ఇచ్చి చెక్కులు, ప్రామిసరీ నోట్లు, భూదస్తావేజులను సీతారామశర్మ తీసుకున్నాడు. సోమశేఖరశర్మ వడ్డీతో సహా అప్పు తీర్చేశాడు. చెక్కులు, దస్తావేజులను సీతారామశర్మ  తిరిగి ఇవ్వ లేదు. అంతేకాకుండా అనుచరులతో కలసి సీతారామశర్మ  కోర్టులో కేసులు వేశాడు. ఈఏడాది ఆగస్టు 9న సోమశేఖరశర్మ ఈవిషయమై ద్వారకాతిరు మల నుంచి సీతారామశర్మ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సోమ శేఖర శర్మపై సీతారామశర్మ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీతారామశర్మను అరెస్టుచేసి  కోర్టులో హాజరుపర్చి రిమాండు  తరలించినట్టు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-10-28T06:20:42+05:30 IST