భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డ భర్త అరెస్టు

ABN , First Publish Date - 2021-11-09T07:07:57+05:30 IST

భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ సోమవారం తెలి పారు.

భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డ భర్త అరెస్టు

అమలాపురం టౌన్‌, నవంబరు 8: భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ సోమవారం తెలి పారు. కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన నాగబాబు 2008 లో పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరగనమూడికి చెందిన కేతా రూపముత్యంను కులాంతర ప్రేమవివాహం చేసుకున్నాడు.  అమలాపు రంలోని దక్షిణామూర్తి వీధిలో ఉన్న అపార్టుమెంటులో వాచ్‌మెన్‌గా పని చేసేందుకు మూడునెలల క్రితం నాగబాబు కుటుంబంతో ఇక్కడకు వచ్చాడు. నాగబాబు నిత్యం మద్యం సేవించి వచ్చి భార్యను కొడుతుంటేవాడు. ఈవిష యం నాగబాబు సోదరుని కుటుంబ సభ్యులకు రూప ఎప్పటికప్పుడు చెబు తుండేది. తన ప్రవర్తన గురించి అందరికీ చెప్పి అవమానపరుస్తుందన్న అక్కసుతో అక్టోబరు 28న రూప గొంతులో నాగబాబు చాకుతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. రూపను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నాగబాబును అరెస్టుచేసి ఏజేఎఫ్‌సీ మేజిస్ర్టేట్‌ కోర్టులో హాజరు పరుచగా న్యాయమూర్తి 14రోజులు రిమాండు విధించారని ఎస్‌ఐ తెలిపారు.  Updated Date - 2021-11-09T07:07:57+05:30 IST