విద్యుదాఘాతంతో మహిళ మృతి
ABN , First Publish Date - 2021-12-30T06:58:03+05:30 IST
విద్యుదాఘాతంతో ఒక మహిళ మృతి చెందింది.

పి.గన్నవరం, డిసెంబరు 29: విద్యుదాఘాతంతో ఒక మహిళ మృతి చెందింది. పి.గన్నవరం శివారు చుట్టుగుళ్లవారిపేటకు చెందిన చుట్టుగుళ్ల సూర్యకాంతమ్మ(51) బుధవారం సాయంత్రం పనికి వెళ్లి వచ్చిన తరువాత చేతి పంపు కొడు తుంది. మోటర్ నుంచి విద్యుత్ వైర్లు ద్వారా పైపునకు కరెంట్ రావడంతో విద్యుదాఘాతానికి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్త నరసింహమూర్తి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ టి.శ్రీనివాసరావు తెలిపారు.