19 మంది ఎస్‌ఐల బదిలీలు
ABN , First Publish Date - 2021-12-26T06:15:58+05:30 IST
జిల్లాలో వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌ఐ)ల ను అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌లో భాగంగా బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్‌బాబు ఉత్తర్వులు జారీచేశారు.

కాకినాడ క్రైం, డిసెంబరు 25 : జిల్లాలో వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌ఐ)ల ను అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌లో భాగంగా బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్‌బాబు ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన ఎస్‌ఐల వివరాలు ఇవీ.. త్రీటౌన్ పీఎస్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కె.పార్థసారథిని ఎటపాక పీఎస్‌కు బదిలీ చేశారు. అడ్డతీగల నుంచి ఎం.సంతోష్‌కుమార్‌ను దుశ్చర్తికి, సఖినేటిపల్లి నుంచి సీహెచ్ గోపాలకృష్ణను వీఆర్ పురంనకు, వీఆర్ పురం నుంచి బీ వెంకటేష్‌ను కూనవరం పోలీస్‌స్టేషన్లకు బదిలీ చేశారు. కూనవరం నుంచి ఎల్ గుణశేఖర్‌ను కాకినాడ వేకెన్సీ రిజర్వు (వీఆర్)కు పంపారు. కిర్లంపూ డి నుంచి జీ అప్పలరాజును అడ్డతీగలకు, గంగవరం నుంచి కేటీ షరీఫ్‌ను జడ్డంగికి, వన్‌టౌన్ క్రైం స్టేషన్ నుంచి ఎల్ లతాశ్రీని అడ్డతీగల అదనపు ఎస్‌ఐగా బదిలీ చేశారు. ఎటపాక నుంచి బి చిన్నబాబును గంగవరంనకు, టూటౌన్ క్రైం నుంచి అన్నంరెడ్డి బాలాజీని తుని రూరల్, గుర్తేడు నుంచి గొర్లె సతీష్‌ను కాకినాడ వీఆర్‌లోకి పంపారు. ఎటపాకల నుంచి డి జ్వాలాసాగర్‌ను గుర్తేడుకు, టూటౌన్ క్రైం నుంచి ఎన్ రామును మారేడుమిల్లి, టూటౌన్ క్రైం నుంచి బి తిరుపతిరావును కిర్లంపూడికి బదిలీ చేశారు. వీఆర్ నుంచి బుచ్చిబాబును బిక్కవోలుకు, బిక్కవోలు నుంచి పి వాసును పెదపూడి, పెదపూడి నుంచి బి వినోద్‌ను టూటౌన్ క్రైం కు, దుశ్చర్తి నుంచి టి క్రాంతికుమార్‌ను వన్‌టౌన్ క్రైం స్టేషన్ ఎస్‌ఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.