కేశవరంలో 125 బస్తాల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-10-19T05:34:23+05:30 IST

మండపేట, అక్టోబరు 18: మండలంలోని కేవవరంలో సోమవారం ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ (రేషన్‌) బియ్యం 125 క్వింటాళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా వున్నాయి... కృష్ణా జిల్లా నుంచి 253 బియ్యం మూటలతో బయల్దేరిన లారీ వస్తోందన్న సమాచారంతో కేశవరంలో మాటువేసిన విజిలెన్స్‌ అధికారులు 125 బస్తాల బియ్యాన్ని లారీ సహా పట్టుకున్నారు. లారీని వదిలేసి డ్రైవర్‌ పరార

కేశవరంలో 125 బస్తాల పీడీఎస్‌ బియ్యం పట్టివేత
స్వాధీనం చేసుకున్న పీడీఎస్‌ బియ్యం లారీ

మండపేట, అక్టోబరు 18: మండలంలోని కేవవరంలో సోమవారం ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ (రేషన్‌) బియ్యం 125 క్వింటాళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా వున్నాయి... కృష్ణా జిల్లా నుంచి 253 బియ్యం మూటలతో బయల్దేరిన లారీ వస్తోందన్న సమాచారంతో కేశవరంలో మాటువేసిన విజిలెన్స్‌ అధికారులు 125 బస్తాల బియ్యాన్ని లారీ సహా పట్టుకున్నారు. లారీని వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడు. పట్టుబడ్డ బియ్యం విలువ రూ.4 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనావేశారు. ఏపీ16టీయూ 5874ని విజిలెన్స్‌ ఎస్‌ఐ  రమేష్‌, విజిలెన్స్‌ తహశీల్దారు విజయకుమార్‌ బృందం లారీని పట్టుకుని బియ్యాన్ని స్వాఽధీనం చేసుకుంది.  బియ్యాన్ని మండపేట ఎంఎస్‌వోకు విజిలెన్స్‌ అధికారులు అప్పగించారు. ఇదిలా ఉండగా పొరుగు జిల్లాల నుంచి మండపేట పరిసరాల్లో వున్న రైస్‌మిల్లులకు తెలంగాణతో పాటు ఏపీలోని పలు జిల్లాల నుంచి రేషన్‌ బియ్యం ప్రతీనెలా వందలాది లారీల్లో ఇక్కడకు చేరుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక చాలా వరకు రైస్‌మిల్లుల్లో రీసైక్లింగ్‌ చేసిన పీడీఎస్‌ బియ్యాన్ని అందమైన ప్యాకింగ్‌తో తయారు చేసి వాటిని బయట మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ మిల్లర్లు లాభాలు గడిస్తున్నారు. 

Updated Date - 2021-10-19T05:34:23+05:30 IST