రేపు అమలాపురం టీటీడీసీలో జాబ్‌మేళా
ABN , First Publish Date - 2021-12-09T05:45:36+05:30 IST
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ డెవలెప్ మెం ట్ ఇన్ ఏపీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల పదో తేదీన అమలా పురం టీటీడీసీలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు డీఆర్‌డీఏ పీడీ కె.సాయి రమణి తెలిపారు.

అమలాపురం రూరల్, డిసెంబరు 8: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ డెవలెప్ మెం ట్ ఇన్ ఏపీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల పదో తేదీన అమలా పురం టీటీడీసీలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు డీఆర్‌డీఏ పీడీ కె.సాయి రమణి తెలిపారు. అమరరాజా బ్యాటరీస్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, ఇన్నోవ్ స్టోర్స్ సర్వీసెస్, మీసో సంస్థలకు సంబంధించి వివిధ ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, బీఎస్సీ, బీఫార్మశీ, డిగ్రీ చదువుకున్న అభ్యర్థులకు జాబ్‌మేళాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. డెక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఉచిత భోజన వసతి సదుపాయంతో పాటు రూ.18లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. నల్లవంతెన దిగువన బాలయోగీ ఘాట్ పక్కన ఉన్న టీటీడీసీ కార్యాలయానికి ఉదయం 10గంటలోగా బయోడేటా, రేషన్‌కార్డు, విద్యార్హత నకళ్లతో హాజరు కావాలని కోరారు. వివరాలకు సెల్: 8919868419ను సంప్రదించాలన్నారు.