నూరుశాతం హాజరు ఉండేలా చర్యలు

ABN , First Publish Date - 2021-12-31T06:05:09+05:30 IST

పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నూరుశాతం ఉండేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఎంఈవో వై.మల్లేశ్వరరావు సూచించారు.

నూరుశాతం హాజరు ఉండేలా చర్యలు

గంగవరం, డిసెంబరు 30: పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నూరుశాతం ఉండేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఎంఈవో వై.మల్లేశ్వరరావు సూచించారు. గురువారం మండలంలోని కొత్తాడ కస్తూర్బా బాలికా విద్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండడాన్ని గమనించిన ఆయన హాజరుశాతం పెంచాలని హెచ్‌ఎంను ఆదేశించారు. విద్యాలయంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్‌ ప్రీపబ్లిక్‌ పరీక్షల నిర్వహణను ఎంఈవో పరిశీలించారు. ఆయన వెంట విద్యాలయ ప్రత్యేకాధికారిణి పద్మావతి, సీఆర్పీ ప్రసాద్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-12-31T06:05:09+05:30 IST