నేటినుంచి జూ పార్కు మూత

ABN , First Publish Date - 2021-05-05T06:44:17+05:30 IST

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల (ఎస్వీ జూ పార్కు)ను బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు క్యూరేటర్‌ హిమశైలజ తెలిపారు.

నేటినుంచి జూ పార్కు మూత

తిరుపతి(అటవీశాఖ), మే 4: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల (ఎస్వీ జూ పార్కు)ను బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు క్యూరేటర్‌ హిమశైలజ తెలిపారు. కరోనా సెంకడ్‌ వేవ్‌ ఉధ్రుతంగా ఉండడంతో జంతువుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి, వన్యప్రాణి విభాగం ముఖ్య సంరక్షణాధికారి ఎన్‌.ప్రదీప్‌కుమార్‌ ఆదేశాల మేరకు మూతవేస్తున్నట్లు పేర్కొన్నారు. సిబ్బంది మాత్రం రోజూ విధులకు హాజరై, వన్యప్రాణుల సంరక్షణ చూసుకుంటారన్నారు. 

Updated Date - 2021-05-05T06:44:17+05:30 IST