‘మా ఎమ్మెల్యే Rojaకు గ్లామర్‌ లేదు..’

ABN , First Publish Date - 2021-12-22T12:44:09+05:30 IST

ఎమ్మెల్యేకు గ్లామర్‌ లేదు. మా కృషితోనే రెండు సార్లు ఆమెను గెలిపించుకున్నాం.

‘మా ఎమ్మెల్యే Rojaకు గ్లామర్‌ లేదు..’

  • పుత్తూరులో రోజా వైరివర్గం ప్రకటన

చిత్తూరు జిల్లా/పుత్తూరు : ‘‘ఎమ్మెల్యేకు గ్లామర్‌ లేదు. మా కృషితోనే రెండు సార్లు ఆమెను గెలిపించుకున్నాం. అధికారం చేతికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ప్రవేశించి మమ్మల్ని పక్కకు నెట్టేసినందునే పార్టీని బతికించుకునేందుకు ఎమ్మెల్యేతో విభేదిస్తున్నాం’’ అంటూ జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ నాయకుడు చక్రపాణిరెడ్డి ప్రకటించారు. మంగళవారం పుత్తూరులో పుట్టినరోజు వేడుకలను వైసీపీ వైరి వర్గ నాయకులు నిర్వహించారు.


తమ పార్టీ అధికారంలో వున్నా ప్రతిపక్ష నాయకుల్లాగా వున్నామని రాష్ట్ర ఈడిగ చైర్‌పర్సన్‌ కెజె శాంతి, మాజీ ఎంపీపీ ఎలుమలై సభలో వాపోయారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కెజెకుమార్‌, జెడ్‌పీటీసీ సభ్యుడు మురళిరెడ్డి, లక్ష్మీపతి రాజు, రవిశేఖర్‌రాజు, నారాయణబాబు, శ్రీధర్‌రాజు, బేతుసుబ్రమణ్యంలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత స్ధానిక శ్రీనివాస ధియేటర్‌ నుంచి ర్యాలీగా బయలు దేరి కార్వేటినగరం కూడలి వద్దకు చేరుకుని    కేక్‌ను కట్‌ చేశారు.

Updated Date - 2021-12-22T12:44:09+05:30 IST