భారీ ఆధిక్యతతో దూసుకెళ్తున్న వైసీపీ అభ్యర్థి

ABN , First Publish Date - 2021-05-02T16:49:36+05:30 IST

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ

భారీ ఆధిక్యతతో దూసుకెళ్తున్న వైసీపీ అభ్యర్థి

తిరుపతి : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ ఆధిక్యతతో దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకూ ఎనిమిది రౌండ్లు పూర్తవ్వగా ప్రతి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థే ముందంజలో ఉంటూ వస్తున్నారు. అయితే టీడీపీ, బీజేపీ అభ్యర్థులు మాత్రం రెండు, మూడు స్థానాలకే పరిమితం అయ్యారు. ఒక్కటంటే ఒక్క రౌండ్‌లోనూ టీడీపీ, బీజేపీ అభ్యర్థులిద్దరూ ఆధిక్యతను చూపించుకోలేకపోయారు. ఒకానొక సందర్భంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికెళ్లిపోయారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై స్పందించిన ఆమె తీవ్రంగా ఖండించారు.


భారీ ఆధిక్యతతో..

కాగా.. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి 1,47,095 ఓట్లతో లీడింగ్‌లో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి ఇప్పటి వరకూ 85,798 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 12,530 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా.. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి 61,296 ఓట్ల భారీ అధిక్యతతో దూసుకెళ్తున్నారు. ఈ ఆధిక్యతను చూసిన గురుమూర్తి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు, స్థానిక నేతలు అటు తిరుపతి, ఇటు నెల్లూరు కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు.. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

Updated Date - 2021-05-02T16:49:36+05:30 IST