ఎమ్మెల్యే భూమన విజ్ఞప్తి.. సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-06-22T13:37:50+05:30 IST

సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని చెప్పారు...

ఎమ్మెల్యే భూమన విజ్ఞప్తి.. సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్‌

తిరుపతి : తిరుపతి అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరుచేయాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సీఎంకు విన్నవించారు. సోమవారం తాడేపల్లెలోని క్యాంపు కార్యాలయంలో ఆయన తన తనయుడు  అభినయ్‌రెడ్డితో కలసి సీఎంను కలిశారరు. నగరాభివృద్ధికి ఇటీవల రూ.183కోట్లు నిధులు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు కింద ఎండీ పుత్తూరు నుంచి మంగళం వరకు రెండో పైపులైను పెండింగ్‌ పనుల పూర్తికి మరో రూ.30 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. గరుడవారధి పనులు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు టీటీడీ ద్వారా అదనపు నిధులు మంజూచేయాలని అభ్యర్థించారు. వీటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పైపులైన్‌ పనుల కోసం రూ. 30కోట్లు మంజూరుకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని చెప్పారు.

Updated Date - 2021-06-22T13:37:50+05:30 IST