ఎక్స్‌కవేటరు కిందపడి యువకుడు మృతి
ABN , First Publish Date - 2021-12-30T05:47:04+05:30 IST
ఎక్స్‌కవేటరు కింద పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన చౌడేపల్లె మండలంలో జరిగింది.

చౌడేపల్లె, డిసెంబరు29: ఎక్స్‌కవేటరు కింద పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన చౌడేపల్లె మండలంలో జరిగింది. మండలంలోని కాగతి పంచాయతీ యనమసామన పల్లెకు చెందిన వీరభద్రకు ఎక్స్‌కవేటర్ ఉంది. ఇతనే డ్రైవర్‌గా ఉంటున్నాడు. పొన్‌పెంటకు చెందిన నరసింహారెడ్డి కుమారుడు ప్రవీణ్ (23) క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి కాటిపేరి వద్ద ఎక్స్‌కవేటరుతో పనులు చేసుకుని తిరిగి వెళుతుండగా మార్గమధ్యంలో ఎక్స్‌కవేటరు నుంచి ప్రవీణ్ ప్రమాదవశాత్తు జారి కిందపడ్డారు. తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.