తెలుగుగంగ కాలువలో పడి యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-07-08T06:32:51+05:30 IST

కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెందిన ఓ యువతి తెలుగుగంగ కాలువలో పడి బుధవారం ఆత్మహత్య చేసుకుంది.

తెలుగుగంగ కాలువలో పడి యువతి ఆత్మహత్య
ఆత్మహత్య చేసుకున్న లావణ్య

కేవీబీపురం జూలై7: కుటుంబ కలహాల కారణంగా  మనస్తాపం చెందిన ఓ యువతి తెలుగుగంగ కాలువలో పడి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. కేవీబీపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు... తొట్టంబేడు మండలం తంగేడుపాళెంనకు చెందిన హేమభూషణ్‌కు ఏర్పేడు మండలంలోని చెల్లూరుకు చెందిన లావణ్య(21)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. మొదట్లో ప్రశాంతంగా కాపురం సాగినా ఆ తరువాత కలహాలు చెలరేగాయి. దీంతో మనస్తాపం చెందిన ఆమె బుధవారం తెలుగుగంగ కాలువలో దూకింది. బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంలో బయలు దేరిన ఆమె నెలిమాలి కండ్రిగ వద్దకు వచ్చి కట్టపై ఆపి తెలుగు గంగ కాలువలో దూకింది. అంజూరు దగ్గర శవం తేలడంతో గమనించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వవైద్యశాలకు తరలించినట్లు ఏఎస్‌ఐ లోకనాథం తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-07-08T06:32:51+05:30 IST