కలికిరి చెరువు గంగమ్మకు ఎల్లమ్మ సారె
ABN , First Publish Date - 2021-11-22T04:48:48+05:30 IST
భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపం దాల్చిన కలికిరి పెద్ద చెరువు గంగమ్మకు ఆదివారం పసుపు, కుంకుమలతోపాటు సారె సమర్పించారు.

కలికిరి, నవంబరు 21: భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపం దాల్చిన కలికిరి పెద్ద చెరువు గంగమ్మకు ఆదివారం పసుపు, కుంకుమలతోపాటు సారె సమర్పించారు. గ్రామ దేవత ఎల్లమ్మ తరపున కుంకుమార్చన నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం గంగమ్మను శాంతింపజేసేందుకు ఎల్లమ్మ ఆలయం నుంచి సంప్రదాయబద్దంగా మేళతాళాలతో ఆలయ పెద్దలు ఊరేగింపుగా పసుపు, కుంకుమలు, సారెను చెరువు వద్దకు తీసుకొచ్చారు. అనంతరం పడమటి మొరవలో గంగమ్మకు సమర్పిం చారు. అదే విధంగా సమీపంలోని చెరువులో కొలవుదీరిన కలికమ్మ, కొలికమ్మ దేవతలకు కూడా పసుపు కుంకుమలను సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకుడు అశోక్‌కుమార్ రెడ్డి, కలికిరి సర్పంచ్ ప్రతాప్‌కుమార్ రెడ్డి, మధుసూదన రెడ్డి తదితరులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.