అభివృద్ధి పనుల్లో వైసీపీ స్టీరింగ్‌ కమిటీ పెత్తనం!

ABN , First Publish Date - 2021-01-20T06:38:59+05:30 IST

ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అధికార పార్టీ సమావేశాలకూ అధికారులు హాజరయ్యే కాలమొచ్చింది.వరదయ్యపాళెం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వైసీపీ మండల స్టీరింగ్‌ కమిటీ సమీక్ష పేరిట ఓ సమావేశం జరిగింది.

అభివృద్ధి పనుల్లో వైసీపీ స్టీరింగ్‌ కమిటీ పెత్తనం!
ఎంపీడీవోతో వాగ్వాదం చేస్తున్న వైసీపీ నాయకులు

అధికార పార్టీలో విభేదాలతో బయటపడ్డ వైనం


వరదయ్యపాళెం, జనవరి 19:ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అధికార పార్టీ సమావేశాలకూ అధికారులు హాజరయ్యే కాలమొచ్చింది.వరదయ్యపాళెం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వైసీపీ మండల స్టీరింగ్‌ కమిటీ సమీక్ష పేరిట ఓ సమావేశం జరిగింది. అభివృద్ధి పనులతో పాటు 14వ ఆర్థిక సంఘ నిఽధుల వినియోగం వంటి అంశాలపై కమిటీ భాగస్వామిగా వ్యవహరిస్తుందని ఆ కమిటీ సభ్యుడు దామోదరరెడ్డి అన్నారు. స్టీరింగ్‌ కమిటీ సలహలను, సూచనలను అధికారులు  పరిగణనలోకి తీసుకోవాలన్నారు.ఎంపీడీవో సుబ్రహ్మణ్యంరాజు, ఈవోపీఆర్డీ శ్రీనివాస్‌, పీఆర్‌ఏఈ తదితరులు పాల్గొన్నారు.ఈ సమాచారం తెలుసుకున్న మరో వర్గం వైసీపీ నాయకులు హుటాహుటిన ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.ఒక వర్గం నాయకులు అనఽధికారికంగా ఏర్పాటు చేసిన సమావేశాలకు మండలస్థాయి అధికారులు హాజరు కావడం ఏంటని  బీసీసెల్‌ అధ్యక్షుడు వీరభద్రం,సేవాదళ్‌ అధ్యక్షుడు శివ,యువత ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి   ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీవోతో వాగ్వాదానికి దిగారు.వైసీపీ నాయకులు కోరడంతోనే సమావేశంలో పాల్గొన్నట్లు ఎంపీడీవో చెప్పారు.

Updated Date - 2021-01-20T06:38:59+05:30 IST