జగన్ పాలన ఐదు దశాబ్దాలు కొనసాగాలని...: సజ్జల
ABN , First Publish Date - 2021-02-06T14:23:53+05:30 IST
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థికంగా ఉన్న ఇబ్బందులని తొలగిపోయి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజారంజకంగా సాగుతున్న జగన్ పాలన నాలుగు...ఐదు దశాబ్దాలు కొనసాగాలని స్వామి వారిని ప్రార్థించానని సజ్జల రామకృష్ణరెడ్డి తెలిపారు.