ద్విచక్ర వాహనం బోల్తా : మహిళ మృతి

ABN , First Publish Date - 2021-08-21T05:41:57+05:30 IST

ద్విచక్ర వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ద్విచక్ర వాహనం బోల్తా : మహిళ మృతి
మృతి చెందిన రుక్మిణమ్మ

కల్లూరు, ఆగస్టు 20: ద్విచక్ర వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్‌ఐ గిరిజ కథనం మేరకు.. పులిచెర్ల మండలం చెల్లావారిపల్లె పంచాయతీ శ్రీనివాసపురానికి చెందిన కృష్ణమూర్తి(25), తల్లి రుక్మిణమ్మ(50)తో కలిసి శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై పనబాకం వెళుతుండగా కల్లూరు ఘాట్‌రోడ్డులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. రుక్మిణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కృష్ణమూర్తికి తీవ్ర గాయాలయ్యాయి. కల్లూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కృష్ణమూర్తిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-21T05:41:57+05:30 IST