ముక్కంటి హుండీ లెక్కింపులో మహిళ చేతివాటం?

ABN , First Publish Date - 2021-12-30T06:11:15+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం జరిగిన హుండీ లెక్కింపులో ఓ మహిళ చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ముక్కంటి హుండీ లెక్కింపులో మహిళ చేతివాటం?

శ్రీకాళహస్తి, డిసెంబరు 29: శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం జరిగిన హుండీ లెక్కింపులో ఓ మహిళ చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు ఏజెన్సీ తరపున ఆలయంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ధనలక్ష్మి గురుదక్షిణామూర్తి సన్నిధి వైపు నుంచి రావడాన్ని ఆలయ భద్రతా సిబ్బంది గుర్తించారు. ఆమెను తనిఖీ చేయగా, దుస్తుల్లో దాచిన రూ.50వేల నగదు బయటపడినట్లు సమాచారం. నిబంధనల మేరకు పరకామణిలో మహిళలకు ప్రవేశం లేదు. అయితే నగదు లెక్కించే ప్రాంతం వైపు ఆమె ఎలా వెళ్లిందనేది పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు చోరీ ఘటన బయటకు పొక్కకుండా పట్టుబడిన నగదును భక్తుల నుంచి అందిన కానుకలకు జమచేసినట్లు తెలుస్తోంది. కాగా, నగదు చోరీ ఘటన తన దృష్టికి రాలేదనీ, విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో పెద్దిరాజు చెప్పారు. 

Updated Date - 2021-12-30T06:11:15+05:30 IST