నూతన విద్యావిధానంతో ప్రాథమిక పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం
ABN , First Publish Date - 2021-08-25T05:53:35+05:30 IST
నూతన విద్యావిధానంతో ప్రాథమిక పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం వుందని, ఈ విధానం అమలుపై ప్రభుత్వం పునరాలోచించాలని శాసనమండలి ప్రొటెంస్పీకర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

శాసనమండలి ప్రొటెంస్పీకర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం
పలమనేరు, ఆగస్టు24 : నూతన విద్యావిధానంతో ప్రాథమిక పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం వుందని, ఈ విధానం అమలుపై ప్రభుత్వం పునరాలోచించాలని శాసనమండలి ప్రొటెంస్పీకర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మంగళవారం ఆయన పలమనేరు మండలం పెంగరగుంట ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు పాఠశాలలు మూత పడడంతో విద్యార్థులు విద్యాపరంగా వెనుకబడ్డారని, ఉపాధ్యాయులు వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. నాడు- నేడు కార్యక్రమంతో పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎంఈవో లీలారాణి, తహసీల్దార్ కుప్పస్వామి, యూటీఎఫ్ సీనియర్ నేత సోమచంద్రారెడ్డి, విద్యాకమిటీ చైర్మన్ బాలరాజు, హెచ్‌ఎం బాలసుందరం పాల్గొన్నారు.