భర్త చేతిలో భార్య హతం

ABN , First Publish Date - 2021-10-30T05:01:14+05:30 IST

భర్త చేతిలో భార్య దారుణహత్యకు గురైన సంఘటన సదుం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది.

భర్త చేతిలో భార్య హతం
మృతురాలు దేవరాజులమ్మ గాయాలను పరిశీలిస్తున్న సీఐ మధుసూదన్‌రెడ్డి

సదుం, అక్టోబరు 29: భర్త చేతిలో భార్య దారుణహత్యకు గురైన సంఘటన సదుం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. చౌడేపల్లె రూరల్‌ సీఐ మధుసూధన్‌రెడ్డి కథనం మేరకు.. మండల పరిధిలోని మొరవపల్లె పంచాయతీ సీతన్నగారిఇండ్లకు చెందిన వెంకటస్వామి, దేవరాజులమ్మ దంపతులు.  వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. రెండేళ్లుగా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్న భర్త తరచూ ఆమెతో ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు ఉదయం భార్యను పొలం వద్దకు తీసుకెళ్లి తలపై మోదడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. కొంతసేపటి తర్వాత వారి కుమారుడు వరదయ్య పొలం వద్దకు వెళ్లే సరికి  తల్లి విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించాడు. తండ్రి కనిపించకపోవడంతో తన తండ్రే తల్లిని హత్య చేసినట్లు అనుమానంతో  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-30T05:01:14+05:30 IST