బ్యాటరీ కార్ల కొనుగోళ్లలో మతలబు ఏంటి?

ABN , First Publish Date - 2021-09-03T06:47:59+05:30 IST

టీటీడీ రూ.7 కోట్లతో బ్యాటరీ కార్లను కొనడంలో మతలబు ఏంటంటూ సీపీఎం నేత కందారపు మురళి ఓ ప్రకటనలో ప్రశ్నించారు.

బ్యాటరీ కార్ల కొనుగోళ్లలో మతలబు ఏంటి?

ఈఎంఐలు ఎక్కువ చెల్లిస్తున్నారంటూ టీటీడీపై  కందారపు విమర్శ 


తిరుపతి(ఆటోనగర్‌), సెప్టెంబరు 2: టీటీడీ రూ.7 కోట్లతో బ్యాటరీ కార్లను కొనడంలో మతలబు ఏంటంటూ సీపీఎం నేత కందారపు మురళి ఓ ప్రకటనలో ప్రశ్నించారు. అందులో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ‘బ్యాటరీ కార్లను తయారు చేసిన టాటా కంపెనీ మార్కెట్లో రూ.13.99 లక్షలకు విక్రయిస్తోంది. బీమా, ఇతర ఖర్చులతో కలిపి రూ.14.5 లక్షలు అవుతుంది. నెలసరి వాయిదాగా రూ.28,232లకు సాధారణ ప్రజలకే ఇస్తోంది. పెద్దధార్మిక సంస్థ అయిన టీటీడీ వేరే కంపెనీ ద్వారా ఒక్కో కారుకు నెలసరి వాయిదా రూ.32వేలు చొప్పున చెల్లిస్తూ 35కార్లు ఎందుకు కొనాలి’ అని మురళి ప్రశ్నించారు. అయిదేళ్లకు ఆ కార్లకు రూ.ఏడు కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నారు. అదే నేరుగా టాటా కంపెనీ ద్వారా కొనుంటే రూ.5.5కోట్లు సరిపోయేదన్నారు. టీటీడీ చార్జింగ్‌ స్టేషన్‌లు, ట్రాన్స్‌ఫోర్ట్‌ వర్క్‌షాపు ఉందన్నారు. అయితే చార్జింగ్‌ పేరుతో లీజు ఒప్పందం చేసుకున్న మర్మమేంటనీ ప్రశ్నించారు. వీటిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు. 

Updated Date - 2021-09-03T06:47:59+05:30 IST