చంద్రగిరిలో ‘మా’కు సాదర స్వాగతం
ABN , First Publish Date - 2021-10-18T06:41:48+05:30 IST
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు చంద్రగిరి మండలంలో సాదర స్వాగతం లభించింది. మా అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈవో మంచు విష్ణు..
చంద్రగిరి, అక్టోబరు 17: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు చంద్రగిరి మండలంలో సాదర స్వాగతం లభించింది. మా అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈవో మంచు విష్ణు.. అసోసియేషన్ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనార్థం హైదరాబాదు నుంచి తిరుపతి విమానాశ్రయానికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. అక్కడినుంచి వారు బయల్దేరి చంద్రగిరి మండలంలోకి ప్రవేశించగానే విష్ణు అభిమానులు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సిబ్బంది, వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారంతా శ్రీవిద్యానికేతన్కు చేరుకుని, అక్కడి నుంచి తిరుమలకు బయల్దేరి వెళ్లారు.