విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం: సీపీఎం

ABN , First Publish Date - 2021-03-14T05:58:17+05:30 IST

పేదప్రజలకోసం తన జీవితాన్నే అంకితం చేసిన పలవలి రామకృష్ణారెడ్డి జ్థాపకార్థం మదనపల్లెలో రూ. 50 లక్షలతో పలవలి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు.

విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం: సీపీఎం
పలవలి రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులకు సంతాపం తెలుపుతున్న సీపీఎం నాయకులు, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి

మదనపల్లె అర్బన్‌, మార్చి13: పేదప్రజలకోసం తన జీవితాన్నే అంకితం చేసిన పలవలి రామకృష్ణారెడ్డి జ్థాపకార్థం మదనపల్లెలో రూ. 50 లక్షలతో  పలవలి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. స్థానిక పుంగనూరు రోడ్డులోని సీఎ్‌సఐ పంక్షన్‌ హాల్‌లో శనివారం జరిగిన పలవలి రామకృష్ణారెడ్డి సంస్మరణ సభకు సీపీఎంరాష్ట్ర కార్యదర్శి పి. మధు తోపాటు రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ యండపల్లె శ్రీనివాసులురెడ్డి, పలువురు వక్తలు హాజరయ్యారు. ముందుగా స్థానిక బర్మావీధిలోని పలవలి స్వగృహానికి వెళ్లి పలవలి సతీమణి సుబ్బమ్మను, వారి కుటుంబ సభ్యులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ యండపల్లె శ్రీనివాసులురెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం పలవలి సంస్మరణ సభలో పలవలి రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పి. మధు మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి అనుసరించిన పద్ధతులు, నడవడికలు, ఆశయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు.సీపీఎం రాష్ట్ర నాయకుడు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వలవలి ఎంతో కష్టపడి పార్టీని అభివృద్ధిలోకి తీసుకొచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యండపల్లె శ్రీనివాసులరెడ్డి, ఓబులు, జెట్టి కృష్ణయ్య, సీపీఐఎంఎల్‌ హరికృష్ణ, చిత్తూరు జిల్లా సీపీఎం జిల్లా కార్యదర్శి చల్లా వెంకటయ్య, తిరుపతి జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య, సీపీఎం నాయకులు నాగరాజు, టి. హరీంద్రనాఽథ్‌శర్మ, పి, శ్రీనివాసులు, వాడ గంగరాజు, సీఐటీయూ నాయకురాలు డీఆర్‌ మధురవాణీ, రాజేశ్వరి, ఐద్వా నాయకురాలు భువనేశ్వరి, సీపీఐ నాయకులు నరసింహులు, రాజ్‌కుమార్‌, శ్రీనివా్‌సగౌడ్‌, మాలమహానాడు నాయకుడు యమలా సుదర్శనం, బాస్‌ నాయకులు పీటీఎం శివప్రసాద్‌, శ్రీచందు, పాల్గొన్నారు.

Updated Date - 2021-03-14T05:58:17+05:30 IST