విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
ABN , First Publish Date - 2021-02-07T05:20:01+05:30 IST
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాజీ మంత్రి పరసా రత్నం పేర్కొన్నారు

మాజీ మంత్రి పరసా రత్నం
తిరుపతి (తిలక్‌రోడ్డు), ఫిబ్రవరి 6: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాజీ మంత్రి పరసా రత్నం పేర్కొన్నారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 1966లో అమృతరావు 20రోజులు నిరాహరదీక్ష చేయడంతో 1971లో 2400 టన్నులతో ప్రారంభించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. కార్మికులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.