భక్తులను రెచ్చగొట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తాం

ABN , First Publish Date - 2021-09-03T06:42:03+05:30 IST

తిరుమలలో కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎక్కువ మంది భక్తులను ఒకేచోట గుమికూడేలా చేయడం.. సెక్యూరిటీ సిబ్బందిని నీచంగా మాట్లాడటం..

భక్తులను రెచ్చగొట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తాం

రాధామనోహర్‌ దాస్‌ వీడియోలపై స్పందించిన టీటీడీ


తిరుమల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎక్కువ మంది భక్తులను ఒకేచోట గుమికూడేలా చేయడం.. సెక్యూరిటీ సిబ్బందిని నీచంగా మాట్లాడటం.. వారిని అన్యమతస్థులుగా చిత్రీకరించి భక్తులను రెచ్చగొట్టేలా వ్యవహరించడం.. ఇలాంటి రాధామనోహర్‌ దాస్‌ చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని టీటీడీ పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కొందరు సెక్యూరిటీ సిబ్బంది.. రాధామనోహర్‌ దాస్‌కు మధ్య జరిగిన వాగ్వాదం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో టీటీడీ స్పందిస్తూ.. ‘రాధా మనోహర్‌దాస్‌ అధికారులను కించపరిచేలా, మతాల మధ్య చిచ్చుపెట్టి భక్తుల్లో అలజడి రేకెత్తించేలా వ్యహరించారు. ఆ వీడియోను, అవాస్తవ సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. గతంలోనూ అనేక సార్లు ఆయన ఇలానే వ్యవహరించారు. ఆయన తిరుమలకు వచ్చినప్పుడల్లా ఉద్యోగులను కించపరచడం, భక్తులను ఇబ్బంది పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఆమోదయోగ్యం కాని భాష వాడుతున్న ఇలాంటి వారికి భక్తులు అడ్డుచెప్పాలి. వారి అవాస్తవ ఆరోపణలను భక్తులు విశ్వసించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అంటూ ఆ ప్రకటనలో టీటీడీ తెలిపింది. 

Updated Date - 2021-09-03T06:42:03+05:30 IST