కలికిరి నుంచి ముగ్గురు వీఆర్వోల బదిలీ

ABN , First Publish Date - 2021-10-31T06:29:24+05:30 IST

కలికిరి మండలంలో పనిచేస్తున్న ముగ్గురు వీఆర్వోలను బదిలీ చేస్తూ జిల్లా రెవెన్యూ అధికారి మురళి ఆదేశాలు జారీ చేసినట్లు తహసీల్దారు రమణి చెప్పారు.

కలికిరి నుంచి ముగ్గురు వీఆర్వోల బదిలీ

కలికిరి, అక్టోబరు 30: కలికిరి మండలంలో పనిచేస్తున్న ముగ్గురు వీఆర్వోలను బదిలీ చేస్తూ జిల్లా రెవెన్యూ అధికారి మురళి ఆదేశాలు జారీ చేసినట్లు తహసీల్దారు రమణి చెప్పారు. కలికిరి-2 వీఆర్వో వెంకట్రమణను చిత్తూరు గిరింపేటకు , మేడికుర్తి నుంచి వెంకటనారాయణను రొంపిచెర్లకు, పత్తేగడ (మర్రికుంటపల్లె ఇన్‌చార్జి) వీఆర్వో వసంతకుమారిని వి.కోట మండలానికి బదిలీ చేశారు. అదేవిధంగా వి.కోట నుంచి వీఆర్వో హరిని మర్రికుంటపల్లె వీఆర్వోగా నియమించినట్లు రమణి వివరించారు.Updated Date - 2021-10-31T06:29:24+05:30 IST