మధ్యాహ్నం 12 పైన కాణిపాకంలో దర్శనాలు రద్దు

ABN , First Publish Date - 2021-05-05T05:36:09+05:30 IST

కరోనా ఉధృతి కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రమై కాణిపాకంలో స్వామివారి దర్శన వేళలను కుదిస్తున్నట్లు ఈవో వెంకటేశు మంగళవారం తెలిపారు.

మధ్యాహ్నం 12 పైన కాణిపాకంలో దర్శనాలు రద్దు

ఐరాల(కాణిపాకం), మే 5: కరోనా ఉధృతి కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రమై కాణిపాకంలో స్వామివారి దర్శన వేళలను కుదిస్తున్నట్లు ఈవో వెంకటేశు మంగళవారం తెలిపారు. ఆలయంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి దర్శనం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలపై స్వామికి నిర్వహించే నివేదనలు, త్రికాల పూజలు, మహాహారతిని ఏకాంతంగా అర్చకులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్వామికి నిర్వహించే పాలాభిషేకం, ప్రత్యేక అభిషేకం, గణపతి హోమం, నిత్యకల్యాణోత్సవానికి టికెట్లు తీసుకొన్న భక్తులు సేవల్లో పాల్గొన వచ్చునన్నారు. ఈ నిబంధనలు బుధవారం నుంచి అమలవుతాయని ఈవో తెలిపారు.


Updated Date - 2021-05-05T05:36:09+05:30 IST