విజయవాణి సంస్థల అధినేత గురుశేఖర మూర్తి కన్నుమూత

ABN , First Publish Date - 2021-03-22T05:54:02+05:30 IST

విజయవాణి విద్యాసంస్థలు, విజయవాణి ప్రింటర్స్‌ యజమాని, మాబడి, పాఠశాల పత్రికల ద్వారా విద్యార్థి లోకంలో పేరుగాంచిన నాయుని గురుశేఖర మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు.

విజయవాణి సంస్థల అధినేత గురుశేఖర మూర్తి కన్నుమూత
గురుశేఖర మూర్త్తి(ఫైల్‌ ఫొటో)

చౌడేపల్లె, మార్చి 21: విజయవాణి విద్యాసంస్థలు, విజయవాణి ప్రింటర్స్‌ యజమాని, మాబడి, పాఠశాల పత్రికల ద్వారా విద్యార్థి లోకంలో పేరుగాంచిన నాయుని గురుశేఖర మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా బెంగళూరులో చికిత్స పొందుతున్న గురుశేఖర మూర్తి ఆదివారం ఉదయం మృతిచెందారు. మధ్యాహ్నం 2గంటలకు మృత దేహాన్ని చౌడేపల్లెలోని విజయవాణి పాఠశాలల సముదాయం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిం చారు. 1944 ఆక్టోబరు 24న జన్మించిన గురుశేఖర మూర్తి తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. పలు ఆలయాల నిర్మాణాలకు విరాళాలివ్వడంతో పాటు సమాజ సేవల ద్వారా మన్ననలు పొందారు. ప్రముఖ రచయిత నాయుని కృష్ణమూర్తి సోదరుడైన గురుశేఖర మూర్తి మృతిపట్ల పలువురు విద్యావేత్తలు, సాహితీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

Updated Date - 2021-03-22T05:54:02+05:30 IST