శ్రీవారిని దర్శించుకున్న విద్యావల్లభ తీర్థ
ABN , First Publish Date - 2021-10-20T07:48:51+05:30 IST
కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని కనియూరు మఠాధిపతి విద్యావల్లభ తీర్థస్వామి మంగళవారం తిరుమల శ్రీవారిని ఆలయ మర్యాదలతో దర్శించుకున్నారు.

తిరుమల, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని కనియూరు మఠాధిపతి విద్యావల్లభ తీర్థస్వామి మంగళవారం తిరుమల శ్రీవారిని ఆలయ మర్యాదలతో దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు శ్రీవారి ఆలయ అర్చకులు, డిప్యూటీఈవో రమే్‌షబాబు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన విద్యావల్లభ తీర్థ స్వామి ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు.