విద్యార్థుల నామినేషన్‌ను 15లోగా అప్‌లోడ్‌ చేయండి

ABN , First Publish Date - 2021-10-07T05:53:14+05:30 IST

మనక్‌ ఇన్‌స్పైర్‌లో విద్యార్థుల నామినేషన్‌ ప్రక్రియను ఈనెల 15లోపు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని డీవైఈవో కృష్ణప్ప పేర్కొన్నారు.ప్రతి జడ్పీహైస్కూల్‌ నుంచి ఐదుగురు, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థులు నామినేషన్‌ వేయాలన్నారు.

విద్యార్థుల నామినేషన్‌ను 15లోగా అప్‌లోడ్‌ చేయండి
గైడ్‌ టీచర్లకు సూచనలిస్తున్న డీవైఈవో కృష్ణప్ప

మదనపల్లె క్రైం, అక్టోబరు 6: మనక్‌ ఇన్‌స్పైర్‌లో విద్యార్థుల నామినేషన్‌ ప్రక్రియను ఈనెల 15లోపు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని  డీవైఈవో కృష్ణప్ప పేర్కొన్నారు. జడ్పీహైస్కూల్లో ఇన్‌స్పైర్‌ మనక్‌ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... త్వరలో భారత్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగే ఇన్‌స్పైర్‌ సైన్స్‌ పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. వినూత్న ఆవిష్కరణలపై పిల్లలకు శిక్షణ ఇవ్వాలన్నారు. నామినేషన్‌ వేసే విద్యార్థికి బ్యాంకు లో ఖాతా ఉండాలన్నారు. ప్రతి జడ్పీహైస్కూల్‌ నుంచి ఐదుగురు, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థులు నామినేషన్‌ వేయాలన్నారు.   పోటీల్లో పాల్గొనే వరకూ గైడ్‌ టీచర్లదే బాధ్యతన్నారు. ఎంఈవో ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-07T05:53:14+05:30 IST