బైపాస్‌ రోడ్డు వద్ద గుర్తుతెలియని శవం

ABN , First Publish Date - 2021-08-03T05:41:58+05:30 IST

గంగవరం సమీపంలోని బైపాస్‌ రోడ్డుపక్కన ఉన్న నీటి మడుగులో గుర్తుతెలియని శవాన్ని కనుగొన్నట్లు గంగవరం ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

బైపాస్‌ రోడ్డు వద్ద గుర్తుతెలియని శవం

పలమనేరు, ఆగష్టు2 : గంగవరం సమీపంలోని బైపాస్‌ రోడ్డుపక్కన ఉన్న నీటి మడుగులో గుర్తుతెలియని శవాన్ని కనుగొన్నట్లు గంగవరం ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. సుమారు 40-50 సంవత్సరాల వయసు ఉంటుందని, మృతుడి ఎత్తు సుమారు 5.2 అడుగులు అని, తెలుపు ఫుల్‌షర్టు, వక్క రంగు బనియన్‌, బ్లూరంగు కలిగిన ఫుల్‌డ్రాయర్‌ ధరించి వున్నాడని ఎస్‌ఐ తెలిపారు. ఈ వ్యక్తిని గుర్తించిన వారు 9440796735, 9491074521 నంబర్లకు తెలియజేయాలని కోరారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-08-03T05:41:58+05:30 IST