ఐక్యతా పరుగు

ABN , First Publish Date - 2021-11-01T04:52:03+05:30 IST

సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ జయంతి సందర్భంగా తిరుపతి అర్బన్‌, చిత్తూరు పోలీసులు ఆదివారం ఐక్యతా ర్యాలీ నిర్వహించారు.

ఐక్యతా పరుగు
ఐక్యతా ర్యాలీలో పాల్గొన్న తిరుపతి అర్బన్‌ ఎస్పీ

సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ జయంతి సందర్భంగా తిరుపతి అర్బన్‌, చిత్తూరు పోలీసులు ఆదివారం ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. పటేల్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘటించి నివాళులర్పించారు. ఆయన సాధించిన ఐక్యతను కాపాడుకుంటూ మనం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన జాతీయ సమైక్యతా పరుగులో ఎస్పీ అప్పలనాయుడు, ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరులో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ సెంథిల్‌ కుమార్‌, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

- తిరుపతి(నేరవిభాగం)/చిత్తూరు 

Updated Date - 2021-11-01T04:52:03+05:30 IST