అమ్మో.. నాగుపాము..!

ABN , First Publish Date - 2021-02-26T07:32:11+05:30 IST

తిరుమలలోని జీఎన్సీకి సమీపంలోని సబ్‌స్టేషన్‌ వెనుకనున్న చెట్లపొదల నుంచి సుమారు ఆరున్నర అడుగులున్న నాగుపాము ఒకటి జనసంచారంలోకి వచ్చింది.

అమ్మో.. నాగుపాము..!
నాగుపామును చూపుతున్న భాస్కర్‌నాయుడు

తిరుమల, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని జీఎన్సీకి సమీపంలోని సబ్‌స్టేషన్‌ వెనుకనున్న చెట్లపొదల నుంచి సుమారు ఆరున్నర అడుగులున్న నాగుపాము ఒకటి జనసంచారంలోకి వచ్చింది. ఈ పామును చూసిన అక్కడి సిబ్బంది, భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న టీటీడీ ఉద్యోగి, పాములు పట్టే భాస్కర్‌నాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పామును చాకచక్యంగా పట్టుకుని.. అవ్వాచారి కోనలోయలో వదిలిపెట్టాడు.

Updated Date - 2021-02-26T07:32:11+05:30 IST