గో సమ్మేళనానికి రెండువేల మంది రైతులు

ABN , First Publish Date - 2021-10-19T07:41:48+05:30 IST

తిరుపతిలో ఈనెల 30, 31 తేదీల్లో టీటీడీ, యుగతులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే గో సమ్మేళనానికి రెండువేల మంది రైతులు హాజరవుతున్నట్లు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.

గో సమ్మేళనానికి రెండువేల మంది రైతులు
సమీక్షలో మాట్లాడుతున్న జేఈవో వీరబ్రహ్మం

తిరుపతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):   తిరుపతిలో ఈనెల 30, 31 తేదీల్లో టీటీడీ, యుగతులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే గో సమ్మేళనానికి రెండువేల మంది రైతులు హాజరవుతున్నట్లు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. వీరికి బస, ఆహార వసతి కల్పనకు టీటీడీ అధికారులు సమన్వయంగా పని చేయాలని కోరారు. తిరుపతిలో సోమవారం ఆయన టీటీడీ అధికారులతో సమీక్షించారు. తిరుచానూరు, తిరుపతిలోని రెండు, మూడు సత్రాలు, ఎస్వీ విశ్రాంతి గృహంలో బస ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో యుగ తులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌, టీటీడీ మాజీ సభ్యుడు శివకుమార్‌, ధార్మిక ప్రాజెక్టుల ప్రొగ్రామింగ్‌ అధికారి విజయసారథి, గోశాల డైరెక్టర్‌ హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T07:41:48+05:30 IST