జలపాతంలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి

ABN , First Publish Date - 2021-10-14T05:53:29+05:30 IST

నాగలాపురం మండల పరిధిలోని సద్దికూటి మడుగు జలపాతంలో మునిగి తమిళనాడుకు చెందిన ఇద్దరు విద్యా ర్థులు మృతి చెందారు.

జలపాతంలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి
సంజయ్‌కుమార్‌(19), దేవా(18)

సత్యవేడు, అక్టోబరు 13: నాగలాపురం మండల పరిధిలోని సద్దికూటి మడుగు జలపాతంలో మునిగి తమిళనాడుకు చెందిన ఇద్దరు విద్యా ర్థులు మృతి చెందారు. ఎస్‌ఐ హనుమంతప్ప కథనం మేరకు... చెన్నైలోని మాధవరం ప్రాంతానికి చెందిన ఇంటర్‌ విద్యార్థులు సంజయ్‌కుమార్‌, దేవా, విజయ్‌, సంతోష్‌, రమేష్‌, తులసినాథన్‌ బుధవారం  విహారయాత్ర కోసం  సద్దికూటి జలపాతం వద్దకు వచ్చారు. వీరిలో సంజయ్‌కుమార్‌(19), దేవా(18) స్నానం కోసం మడుగులో లోపలికి వెళ్లి  బయటకు రాలేకపోయారు. గమనించిన మిగిలిన యువకులు కేకలు వేయడంతో స్థానికులు వారిని బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు జలపాతం వద్దకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-10-14T05:53:29+05:30 IST