రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-09-19T05:37:15+05:30 IST

వేగంగా వస్తున్న ద్విచక్రవాహనం ఓ వ్యక్తిని ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం రాత్రి రేణిగుంట మండలంలో జరిగింది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రేణిగుంట, సెప్టెంబరు 18: వేగంగా వస్తున్న ద్విచక్రవాహనం ఓ వ్యక్తిని ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం రాత్రి రేణిగుంట మండలంలో జరిగింది. గాజులమండ్యం ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం మేరకు... ఏర్పేడు మండలం పాపానాయుడుపేటకు చెందిన కె.చందు(24), ఓ స్నేహితుడితో కలసి శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంలో రేణిగుంట మండలం అత్తూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలోని గాజులమండ్యం వద్దకు రాగానే రోడ్డు దాటుతున్న స్థానికుడు మాధవయ్య(58)ను వేగంగా వస్తున్న వీరి వాహనం ఢీకొంది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందగా, గాయపడిన కె.చందు ఆయన స్నేహితుడిని 108 సిబ్బంది రుయాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చందు మృతిచెందగా, మెరుగైన వైద్యసేవల నిమిత్తం యువకుడి స్నేహితుడిని స్విమ్స్‌కు తరలించినట్లు గాజులమండ్యం ఎస్‌ఐ పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-19T05:37:15+05:30 IST